శ్రీ శ్రీ గుర్వాష్టకము

1.

సంసారదావానలలీఢలోక
త్రాణాయ కారుణ్య ఘనాఘనత్వమ్ I
ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య
వందే గురో: శ్రీ చరణారవిందమ్ II

ప్రతి పదార్థం

సంసార – సంసారము (అనెడి); దావానల – దావాగ్ని; లీఢ – బాధపడుచున్న; లోక – లోకము; త్రాణాయ – విముక్తి కలిగించుటకు; కారుణ్య – కరుణా పూరిత; ఘనాఘనత్వమ్ – ఆకాశములోని దట్టమైన మేఘము; ప్రాప్తస్య – పొందిన వారైన; కళ్యాణ గుణా: – కళ్యాణ గుణములు; ఆర్ణవస్య – సముద్రం; వందే – నా ప్రణామములు అర్పిస్తున్నాను; గురో: – గురుదేవుల యొక్క; శ్రీ – పవిత్రమైన; చరణారవిందం – చరణారవిందములకు

అనువాదం

శ్రీ గురుదేవులు కరుణా సముద్రము నుండి వరాలను పొందుతున్నారు. మేఘము దావాగ్నిపై వర్షించి ఆ దావాగ్నిని ఆర్పుతుందో, అదేవిధంగా గురుదేవులు కూడా సంసారమనే దావాగ్నిని ఆర్పి భౌతిక దు:ఖములతో బాధపడుతున్న జగత్తుకు విముక్తిని కల్పిస్తున్నారు. అటువంటి కరుణా సాగరుడైన గురుదేవుల పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.


2.

మహాప్రభో: కీర్తననృత్య గీత
వాదిత్ర మాద్యన్మనసో రసేన I
రోమాంచకంపాశ్రుతరంగభాజో
వందే గురో: శ్రీ చరణారవిందమ్ II

ప్రతి పదార్థం

మహాప్రభో: – మహాప్రభువు యొక్క; కీర్తన – కీర్తన (ద్వారా); నృత్య – నృత్యము; గీత – గానము; వాదిత్ర – సంగీత వాయిద్యములను మ్రోగిస్తూ; మాద్యత్ – హర్షాతిరేకములు కలిగి ఉందురు; మనస: – ఎవరి మనస్సు; రసేన – విశుద్ధ ప్రేమభక్తి రసాలను ఆశ్వాదించడం చేత; రోమాంచక – రోమాంచకం; కంపా – శరీరం కంపించడం; అశ్రు తరంగ – అశ్రు ధారలు; భాజ: – భావిస్తారో; వందే – నా ప్రణామములు అర్పిస్తున్నాను; గురో: – గురుదేవుల యొక్క; శ్రీ – పవిత్రమైన; చరణారవిందం – చరణారవిందములకు

అనువాదం

పవిత్ర భగవన్నామాలను కీర్తిస్తూ, నృత్యము చేస్తూ, గానము చేస్తూ, సంగీత వాయిద్యములను మ్రోగిస్తూ శ్రీ గురుదేవులు ఎల్లప్పుడూ శ్రీ చైతన్య మహాప్రభువు వారి సంకీర్తన ఉద్యమము పట్ల హర్షాతిరేకములు కలిగి ఉంటారు. వారు తమ హృదయము నందు విశుద్ధ భక్తి రసాలను ఆశ్వాదించుట చేత అప్పుడప్పుడు వారి రోమములు నిక్కబొడుచుకొనును, శరీరము కంపించును మరియు వారి కనుల నుండి అశ్రు ధారలు ప్రవహించును. అటువంటి గురుదేవుల పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.


3.

శ్రీవిగ్రహారాధననిత్యనానా
శృంగార తన్మందిర మార్జనాదౌ I
యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోຂపి
వందే గురో: శ్రీ చరణారవిందమ్ II

ప్రతి పదార్థం

శ్రీవిగ్రహ – శ్రీవిగ్రహ మూర్తుల (యొక్క); ఆరాధన – ఆరాధన; నిత్య – నిత్యమూ; నానా – వివిధములైన; శ్రంగార – వస్త్రాలు మరియు ఆభరణములతో అలంకరించుట; తత్ – భగవంతుని యొక్క; మందిర – మందిరము (యొక్క); మార్జన ఆదౌ – మార్జనము మొదలగునవి; యుక్తస్య – ఎవరైతే నెలకొని ఉంటారో; భక్తాన్ – భక్తులను; చ – మరియు; నియుంజత: – ఎవరైతే నియుక్తులను చేస్తారో; వందే – నా ప్రణామములు అర్పిస్తున్నాను; గురో: – గురుదేవుల యొక్క; శ్రీ – పవిత్రమైన; చరణారవిందం – చరణారవిందములకు

అనువాదం

శ్రీ గురుదేవులు నిత్యమూ శ్రీ శ్రీ రాధా కృష్ణుల మందిర ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. మరియు ఆయన తన శిష్యులను కూడా అటువంటి సేవలో నిమగ్నం చేస్తారు. వారు అందమైన వస్త్రాలతో మరియు ఆభరణాలతో శ్రీ విగ్రహాలను అలంకరిస్తూ, మందిరమును పరిశుభ్ర పరుస్తూ వివిధ విధములుగా భగవంతుని ఆరాధింతురు. అటువంటి గురుదేవుల పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.


4.

చతుర్విధ శ్రీభగవత్ ప్రసాద –
స్వాద్వన్నతృప్తాన్ హరిభక్త సంఘాన్ I
కృత్యైవ తృప్తిం భజత: సదైవ
వందే గురో: శ్రీ చరణారవిందమ్ II

ప్రతి పదార్థం

చతుర్విధ – నాలుగు రకములైన; శ్రీశ్రీ – పవిత్రమైన; భగవత్-ప్రసాద – భగవంతునికి అర్పించిన ప్రసాదమును; స్వాదు – రుచికరమైన; అన్న – ఆహారములను; తృప్తాన్ – ఆధ్యాత్మికముగా తృప్తి చెందిన; హరి భక్తసంఘాన్ – హరి లేదా కృష్ణ భక్తులు; కృత్య ఏవ – ఆవిధముగా చేయడం ద్వారా; తృప్తిం – తృప్తి; భజత: – భావింతురు; సదా – ఎల్లప్పుడూ; ఏవ – నిశ్చయముగా; వందే – నా ప్రణామములు అర్పిస్తున్నాను; గురో: – గురుదేవుల యొక్క; శ్రీ – పవిత్రమైన; చరణారవిందం – చరణారవిందములకు

అనువాదం

శ్రీ గురుదేవులు సదా కృష్ణునికి నాలుగు రకములైన (చీకేవి, చప్పరించబడేవి, త్రాగబడేవి మరియు పీల్చబడేవి) రుచికరములైన ఆహార పదార్థములను అర్పింతురు. భక్తులు భగవత్ ప్రసాదమును గ్రహించి తృప్తి చెందునపుడు శ్రీ గురుదేవులు తృప్తి చెందుదురు. అటువంటి గురుదేవుల పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.


5.

శ్రీరాధికామాధవయోరపార
మాధుర్య లీలా గుణరూపనామ్నామ్ I
ప్రతిక్షణా స్వాదణలోలుపస్య
వందే గురో: శ్రీ చరణారవిందమ్ II

ప్రతి పదార్థం

చతుర్విధ – నాలుగు రకములైన; శ్రీశ్రీ – పవిత్రమైన; భగవత్-ప్రసాద – భగవంతునికి అర్పించిన ప్రసాదమును; స్వాదు – రుచికరమైన; అన్న – ఆహారములను; తృప్తాన్ – ఆధ్యాత్మికముగా తృప్తి చెందిన; హరి భక్తసంఘాన్ – హరి లేదా కృష్ణ భక్తులు; కృత్య ఏవ – ఆవిధముగా చేయడం ద్వారా; తృప్తిం – తృప్తి; భజత: – భావింతురు; సదా – ఎల్లప్పుడూ; ఏవ – నిశ్చయముగా; వందే – నా ప్రణామములు అర్పిస్తున్నాను; గురో: – గురుదేవుల యొక్క; శ్రీ – పవిత్రమైన; చరణారవిందం – చరణారవిందములకు

అనువాదం

శ్రీ గురుదేవులు సదా కృష్ణునికి నాలుగు రకములైన (చీకేవి, చప్పరించబడేవి, త్రాగబడేవి మరియు పీల్చబడేవి) రుచికరములైన ఆహార పదార్థములను అర్పింతురు. భక్తులు భగవత్ ప్రసాదమును గ్రహించి తృప్తి చెందునపుడు శ్రీ గురుదేవులు తృప్తి చెందుదురు. అటువంటి గురుదేవుల పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.


6.

యా యాలిభిర్యుక్తిరపేక్షణీయా I
యా యాలిభిర్యుక్తిరపేక్షణీయా I
తత్రాతిదాక్ష్యాదతివల్లభస్య
వందే గురో: శ్రీ చరణారవిందమ్ II

ప్రతి పదార్థం

నికుంజయూన: – రాధాకృష్ణుల యొక్క; రతి కేళి – మాధుర్య లీలల; సిద్ధ్యై – పరిపూర్ణత కొరకు; యా యా – ఏదైతే; ఆలిభి: – గోపికల ద్వారా; యుక్తి: – ఏర్పాట్లు; అపేక్షణీయ – కావాల్సిన; తత్ర – ఆ విషయంలో; అతి దక్ష్యాద్ – అత్యంత నిపుణులగుటవలన; అతి-వల్లభస్య – అత్యంత ప్రియమైన వారు కావడం వలన; వందే – నా ప్రణామములు అర్పిస్తున్నాను; గురో: – గురుదేవుల యొక్క; శ్రీ – పవిత్రమైన; చరణారవిందం – చరణారవిందములకు.

అనువాదం

శ్రీ గురుదేవులు వృందావన కుంజములలో శ్రీ శ్రీ రాధాకృష్ణుల మాధుర్య లీలల పరిపూర్ణతకు వివిధ ఏర్పాట్లు చేయు వివిధ గోపికలకు సహాయము చేయుటలో నిపుణులగుట వలన, వారు రాధాకృష్ణులకు అత్యంత ప్రీతి పాత్రులు. అటువంటి గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.


7.

సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రై
రుక్తస్తథా భావ్యత ఏవ సద్భి: I
కింతు ప్రభోర్య: ప్రియ ఏవ తస్య
వందే గురో: శ్రీ చరణారవిందమ్ II

ప్రతి పదార్థం

సాక్షాత్ – సాక్షాత్తుగా; హరిత్వేన – హరి యొక్క గుణముతో; సమస్త – సమస్తములైన; శాస్త్రై: – శాస్త్రముల ద్వారా; ఉక్త: – అంగీకరించబడెను; తథా – అందువలన; భావ్యతే – పరిగణీంచబడెను; ఏవ – కూడా; సద్భి: – సాధువుల ద్వారా; కింతు – కానీ; ప్రభో: – ప్రభువునకు; య: – ఎవరైతే; ప్రియ; – ప్రియమైన వారు; ఏవ – నిశ్చయముగా; తస్య – ఆయన (గురువు) యొక్క; వందే – నా ప్రణామములు అర్పిస్తున్నాను; గురో: – గురుదేవుల యొక్క; శ్రీ – పవిత్రమైన; చరణారవిందం – చరణారవిందములకు.

అనువాదం

శ్రీ గురుదేవులు భగవంతునికి పరమ ఆంతరంగిక సేవకులగుట చేత ఆయనను భగవంతునితో సమానముగా గాఉరవించవలెను. ఈ విషయాన్ని సకల శాస్త్రములు మరియు ప్రామాణిక సాధువులందరూ ధృవ పరిచారు. అటువంటి శ్రీహరి యొక్క ప్రామాణిక ప్రతినిధియైన శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.


8.

యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో
యస్యప్రసాదాన్న గతి: కుతోຂపి I
ధ్యాయన్ స్తువంస్తస్య యశస్త్రిసంధ్యం
వందే గురో: శ్రీ చరణారవిందమ్ II

ప్రతి పదార్థం

యస్య – ఎవరి యొక్క; ప్రసాదాత్ – కృపచేత; భగవత్ – భగవంతుని; ప్రసాద: – కృపను; యస్య – ఎవరి యొక్క; అప్రసాదాత్ – కృపలేకుండా; న గతి: – ప్రగతి లేదు; కుత: అపి – ఎక్కడి నుండి కూడా; ధ్యాయన్ – ధ్యానిస్తూ; స్తువన్ – స్తుతిస్తూ; తస్య – ఆతని; యశ: – యశస్సు; త్రి సంధ్యం – త్రిసంధ్యలలో (ఉదయము, మద్యాహ్నము, సాయంత్రం); వందే – నా ప్రణామములు అర్పిస్తున్నాను; గురో: – గురుదేవుల యొక్క; శ్రీ – పవిత్రమైన; చరణారవిందం – చరణారవిందములకు.

అనువాదం

శ్రీ గురుదేవుల కృపవలన శ్రీ కృష్ణ భగవానుని కృపను పొందగలము. వారి కృప లేకుండా ఎవరూ భక్తి మార్గమున ప్రగతి సాధించలేరు. కాబట్టి త్రిసంధ్యలలో (సూర్యోదయం, మద్యాహ్నం, సూర్యాస్తమయం) శ్రీ గురుదేవులను స్మరిస్తూ స్తుతించవలెను. అటువంటి గురుదేవుల పాద పద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.

teతెలుగు