శ్రీ గౌర ఆరతి

(శ్రీల భక్తివినోద ఠాకూర విరచితము)

1.

(కిబ) జయ జయ గౌరచందేర్ ఆరతి కో శోభ
జాహ్నవీ తట వనే జగమాన లోభా

ప్రతి పదార్థం 

కిబ - ఆహా!; జయ - జయము జయము; గౌరచందేర్ - శ్రీచైతన్య మహాప్రభువు యొక్క; ఆరతి కో శోభ - ఆరతీ శోభకు; జాహ్నవీ తట - జాహ్నవి (గంగా) నది తీరములో గల; వనే - వనములో; జగమాన - విశ్వములోని అన్ని జీవరాశుల హృదయాలను; లోభ - ఆకట్టుకొనుచున్నది;

అనువాదం

మనోహరమైన శ్రీచైతన్య మహాప్రభువు ఆరతీ శోభకు జయము జయము. ఈ గౌర ఆరతీ జాహ్నవి (గంగా) నది తీరములో గల వనములో జరుగుతూ విశ్వములోని అన్ని జీవరాశుల హృదయాలను ఆకట్టుకొనుచున్నది.


2.

దఖినే నితాయ్ చాంద్, బామే గదాధర
నికటే అద్వైత, శ్రీనివాస ఛత్రధర

ప్రతి పదార్థం 

దఖినే - కుడివైపున; నితాయ్ చాంద్ - శ్రీనిత్యానంద ప్రభువు; బామే - ఎడమవైపున; గదాధర - శ్రీగదాధరుడు; నికటే - దగ్గరలో; అద్వైత - శ్రీఅద్వైత ప్రభువు; శ్రీనివాస - శ్రీనివాస ఠాకూరు; ఛత్రధర - గొడుగు పట్టుకుని ఉన్నాడు

అనువాదం

శ్రీచైతన్య మహాప్రభువు కుడివైపున శ్రీనిత్యానంద ప్రభువు మరియు ఎడమ వైపున శ్రీగదాధరుడు ఉన్నాడు. దగ్గరలో శ్రీఅద్వైత ప్రభువు నిలబడి ఉన్నాడు. మరియు శ్రీనివాస ఠాకూరు శ్రీచైతన్య మహాప్రభువునకు గొడుగు పట్టుకుని ఉన్నాడు.


3.

బోసియాఛే గోరాచాంద్ రత్నసింహాసనే
ఆరతి కొరేన బ్రహ్మ ఆది దేవగణే

ప్రతి పదార్థం 

బోసియాచే‌ - ఆసీనులైయున్నారు; గోరాచాంద్‌ - గౌర చంద్రుడు (శ్రీ చైతన్య మహాప్రభువు); రత్న సింహాసనహసనే - రత్నపు సింహాసనముపై; ఆరతి - ఆరతి; కొరేన్ - చేస్తున్నారు; బ్రహ్మ ఆది - బ్రహ్మతో మొదలుకొని; దేవగణే - దేవతలందరూ

అనువాదం

శ్రీ చైతన్య మహాప్రభువు రత్నపు సింహాసనముపై ఆసీనులైనారు, బ్రహ్మతో మొదలుకొని దేవతలందరు ఆయనకు ఆరతి చేస్తున్నారు.


4.

నరహరి ఆది కొరీ చామర ఢులాయ
సంజయ ముకుంద బాసు ఘోష్ ఆది గాయ

ప్రతి పదార్థం 

బోసియాచే‌ - ఆసీనులైయున్నారు; గోరాచాంద్‌ - గౌర చంద్రుడు (శ్రీ చైతన్య మహాప్రభువు); రత్న సింహాసనహసనే - రత్నపు సింహాసనముపై; ఆరతి - ఆరతి; కొరేన్ - చేస్తున్నారు; బ్రహ్మ ఆది - బ్రహ్మతో మొదలుకొని; దేవగణే - దేవతలందరూ

అనువాదం

 నరహరి సర్కారు మరియు శ్రీచైతన్య మహాప్రభువుయొక్క ఇతర అనుయాయులు ఆయనకు చామరలు వీస్తున్నారు. సంజయ పండిత, ముకుంద దత్త, వాసుఘోష మరియు ఇతర భక్తులు మధురమైన గీతములను పాడుతున్నారు.


5.

 శంఖ బాజే ఘంటా బాజే బాజే కరతాళ
మధుర మృదంగ బాజే పరమ రసాల

ప్రతి పదార్థం

శంఖ - శంఖములు; బాజే - మ్రోగుచున్నవి; ఘంట - గంటలు; బాజే - మ్రోగుచున్నవి; బాజే - మ్రోగుచున్నవి; కరతాళ - కరతాళములు; మధుర - మధురమైన; మృదంగ - మృదంగములు; బాజే - మ్రోగుచున్నవి; పరమ రసాల - అత్యంత మధురమైనది;

అనువాదం

 శంఖములు, గంటలు మరియు కరతాళ ధ్వనులు మార్మ్రోగుచున్నాయి. మృదంగాలు మధురముగా మ్రోగసాగాయి. ఈ కీర్తన యొక్క సంగీతము అత్యంత మధురముగాను, చెవికింపుగాను ఉన్నది.


6.

బహుకోటి చంద్ర జిని' వదన ఉజ్జ్వల
గల దేశే వనమాల కోరే ఝలమల

ప్రతి పదార్థం 

బహుకోటి - కోట్లకొలది; చంద్ర - చంద్రుల; జిని - అతిశయింప చేసినది; వదన - వదనము (ముఖము); ఉజ్జ్వల - ఉజ్జ్వలమైన; గల దేశే - మెడలోని; వనమాల - వన పుష్పాలతో చేసిన పూమాల; కొరే - చేస్తుంది; ఝలమల - కాంతులీనిచున్నది;

అనువాదం

 శ్రీచైతన్య మహాప్రభువు యొక్క ఉజ్జ్వల వదనము కోట్లకొలది చంద్రులను సైతం అతిశయింప చేసినది. వారి మెడలో అటవీ పుష్పాలతో చేసినటువంటి పూలమాల కాంతులీనుచున్నది.


7.

శివశుక నారద ప్రేమే గద గద
భకతి వినోద దేఖే గోరార సంపద

ప్రతి పదార్థం 

శివ - పరమ శివుడు; శుక - శుకదేవ గోస్వామి; నారద - నారద ముని; ప్రేమే - దివ్య ప్రేమ వలన; గద గద - (వారి గొంతులు) గద్గదమైనవి; భకతి - భక్తి వినోద ఠాకూరు; దేఖే - దర్శిస్తున్నారు; గోరార సంపద - శ్రీచైతన్య మహాప్రభువువారి అపారమైన సౌందర్యము;

అనువాదం

శివుడు, శ్రీ శుకదేవ గోస్వామి మరియు నారదముని అందరూ అక్కడ ఉన్నారు. దివ్య ప్రేమ పారవశ్యము వలన వారి గొంతులు గద్గదమైనాయి. ఆవిధముగా భక్తివినోద ఠాకూరు శ్రీచైతన్య మహాప్రభువు యొక్క అపూర్వ వైభవాన్ని దర్శిస్తున్నారు.

teTE