శ్రీ నృసింహ ఆరతి

1.

నమస్తే నరసింహాయ
ప్రహ్లాదహ్లాద దాయినే
హిరణ్యకశిపోర్వక్ష:
శిలాటంకన ఖాలయే

ప్రతి పదార్థం

నమస్తే - నా ప్రణామములు; నరసింహాయ - నరసింహ దేవునికి; ప్రహ్లాద - ప్రహ్లాద మహారాజుకు; ఆహ్లాద - ఆనందాన్ని; దాయినే - ఇచ్చేవాడు; హిరణ్యకశిప: - హిరణ్యకశిపుని యొక్క; వక్ష: - వక్షస్థలము; శిలా - శిలవంటి; టంక - పదునైన; నఖనఖ - గోళ్ళు; ఆలయే - నిలయం

అనువాదం

ప్రహ్లాదునికి ఆనందమును కలిగించినటువంటి వాడు మరియు ధైత్య రాజైన హిరణ్యకశిపుని కఠిన చాతిని శీలముల వంటి తన చేతి గోరులతో చీల్చినటువంటి వాడైన ఆ నృసింహ భగవానునికి నా ప్రణామములు


2.

ఇతో నృసింహ: పరతో నరసింహో
యతో యతో యామి తతో నృసింహ:
బహిర్ నృసింహో హృదయే నృసింహో
నరసింహమాదిం శరణం ప్రపద్యే

ప్రతి పదార్థం

ఇత: - ఇక్కడ; నృసింహ: - నరసింహ భగవానుడు; పరత: - అక్కడ; నరసింహ: - నరసింహ భగవానుడు; యత: యత: - ఎక్కడెక్కడ; యామి - వెళ్ళినా; తత: - అక్కడ; నృసింహ: - నరసింహ భగవానుడు; బహి: - బయట; నృసింహ: - నరసింహ భగవానుడు; హృదయే - హృదయములో; నృసింహ: - నరసింహ భగవానుడు; నరసింహం - నరసింహ దేవునికినికి; ఆదిం - ఆది; శరణం - శరణు; ప్రపద్యే - నేను శరణు వేడుతున్నాను;

అనువాదం

ఆ నృసింహ భగవానుడు ఇచ్చట కలడు మరియు అచ్చట కూడా గలడు. నీ నెచటికు వెడలినను అచ్చట కూడా నృసింహ భగవానుడు కలడు. భగవంతుడు నా హృదయమునందున కలడు మరియు బయట కూడా కలడు. సమస్తమునకు మూలము మరియు పరమాశ్రయమైన ఆ నృసింహ భగవానునికి నా ప్రణామములు


3.

తవ కరకమల వరే నఖమద్భుతశృంగం
దళిత హిరణ్యకశిపు తనుభృంగం
కేశవ ధృత నరహరి రూప జయ జగదీశ హరే
జయ జగదీశ హరేజయ జగదీశ హరే

ప్రతి పదార్థం

తవ - మీ; కర కమల - కమలము వంటి హస్తములు; వరే - గొప్ప; నఖం - గోళ్ళు; అద్భుత - అద్భుతమైన; శృంగం - చిగురులు; దళిత - చీల్చివేయుట; హిరణ్యకశిపు - హిరణ్యకశిపు; తను - శరీరం; భృంగం - కందిరీగ; కేశవ - ఓ కేశవా; ధృత - ధరించిన; నరహరి - భగవంతుని రూపము (సగ భాగం మనిషి, సగ భాగం సింహం); రూప - రూపం; జయ - జయము జయము; జగదీశ - ఓ జగన్నథుడా; హరే - ఓ హరీ;

అనువాదం

నరహరి రూపాన్ని ధరించిన ఓ కేశవా! ఓ జగదీశా! ఓ హరే! నీకు జయము జయము. ఏ విధముగానయితే మనము సునాయాసముగా కందిరీగను నులిమి వేస్తామో, నీవు కందిరీగ లాంటి దైత్యుడైన హిరణ్యకశిపు శరీరమును నీ సుందరమైన కమలములు వంటి కరములకు కలిగిన అద్భుతమైన గోళ్ళతో చీల్చివేసావు.

teతెలుగు