శ్రీ తులసీ ప్రణామ మంత్రము
వృందాయై తులసీ దేవ్యాయై
ప్రియాయై కేశవశ్య చ
విష్ణు-భక్తి ప్రదే దేవీ
సత్యవత్యై నమో నమ:
ప్రతి పదార్థం
వృందాయై - ఓ వృందా దేవీ!; తులసీ దేవ్యాయై - తులసీ దేవీ; ప్రియాయై కేశవశ్య - కేశవునికి ప్రియమైన; చ - కూడా; విష్ణు భక్తి ప్రదే దేవీ - విష్ణుభక్తిని ప్రసాదింపగల దానివి; సత్యవత్యై - సత్యవతివి; నమో నమ: - నా పరి పరి ప్రణామములు
అనువాదం
యాని కాని చ - ఎటువంటి; చ - మరియు; పాపాని - పాపములు; బ్రహ్మ హత్యాది కాని చ - బ్రాహ్మణ హత్య వంటి పాపములు కూడా; తాని తాని - అవన్నీ; ప్రణష్యన్తి - నశించిపోవును; ప్రదక్షిణ - (తులసీ దేవికి) ప్రదక్షిణ చేయడం ద్వారా; పదే పదే - ప్రతి పదములోనూ
శ్రీ తులసీ ఆరతి
(శ్రీమతి తులసీదేవి యొక్క కీర్తన)
1.
నమో నమ: తులసీ! కృష్ణ ప్రేయసీ నమో నమ:
రాధా కృష్ణ సేవా పాబో ఏయ్ అభిలాషీ
ప్రతి పదార్థం
నమో నమ: - నీకు పరి పరి (పదే పదే) ప్రణామములు; తులసీ! - ఓ తులసీ దేవీ!; కృష్ణ ప్రేయసీ - శ్రీకృష్ణ భగవానునికి ప్రియమైన; రాధాకృష్ణ సేవా - రాధాకృష్ణుల సేవ; పాబో - పొందాలనేది; ఏయ్ - ఇది; అభిలాషీ - నా అభిలాష (కోరిక)
అనువాదం
శ్రీకృష్ణ భగవానునికి ప్రియమైన ఓ తులసీదేవి నీకు నా పరిపరి ప్రణామములు. శ్రీశ్రీ రాధాకృష్ణుల సేవా భాగ్యము పొందాలనేదే నా అభిలాష
2.
యే తొమార శరణ లోయ్, తారా వాంఛా పూర్ణ హోయ్
కృపా కోరి కోరో తారే వృన్దావన వాసీ
ప్రతి పదార్థం
ఏ - ఎవరైతే; తొమార - నీయొక్క; శరణ - శరణాగతి; లోయ్ - తీసుకుంటారో; తారా - వారియొక్క; వాంఛా - కోరిక; పూర్ణ హోయ్ - నెరవేరబడుతుంది. కృపాకోరి - (వారిపై) దయచూపి; కోరో - చేస్తారు; తారే - వారిని; వృన్దావన వాసీ - వృన్దావన వాసులను
అనువాదం
ఎవరైతే నీ శరణు పొందుదురో వారి వాంఛలన్నీ నెరవేర్చబడును. నీవు వారిపై కృప చూపి వారిని వృందావన వాసులను చేసేదవు.
3.
మోర ఏయ్ అభిలాష్, విలాస్ కుంజే దియో వాస్
నయన హేరిభో సదా యుగళ రూప రాశి
ప్రతి పదార్థం
మోర - నాయొక్క; ఏయ్ - ఈయొక్క; అభిలాష్ - కోరిక; విలాస్ కుంజే - విలాసకుంజములలో; దియో వాస్ - నివాసమివ్వు; నయన - కళ్ళు; హేరిభో - చూస్తాయి; సదా - నిరంతరము; యుగళ రూపరాశి - రాధాకృష్ణుల అందమైన లీలలను
అనువాదం
నీవు నాపై కృప చూపి వృందావనములోని విలాస కుంజములో నివాసమిచ్చినచో శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క అందమైన లీలలను ఎల్లప్పుడూ దర్శనం చేసుకోగలననునదే నా అభిలాష
4.
ఏయ్ నివేదన ధర సఖీరనుగత కోరో
సేవా అధికార దియే కోరో నిజ దాసీ
ప్రతి పదార్థం
ఏయ్ - ఈ; నివేదన - విన్నపం; ధర - స్వీకరించు; సఖీరనుగత - గోపికల అనుచరుని; కోరో - చేయుము; సేవా అధికార - సేవచేసే అర్హత; దియే - కల్రించి; కోరో - చేయుము; నిజ దాసి - నీ సొంత దాసునిగా;
అనువాదం
నన్ను వ్రజధామంలోని గోపికల అనుచరుని చేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. దయచేసి నాకు భగవత్సేవను చేసే అవకాశాన్ని కల్పించి, నన్ను నీ దాసునిగా చేసుకొనుము.
5.
దీన కృష్ణ దాసే కోయ్, ఏయ్ జేన మోర హోయ్
శ్రీ రాధాగోవింద ప్రేమే సదా జేన భాసీ
ప్రతి పదార్థం
దీన- దీనుడైన; కృష్ణ దాసే - కృష్ణ దాసుడు; కోయ్ - చెబుతున్నాడు; ఏయ్ జేన మోర హోయ్ - ఇది నా భాగ్యం కావాలి; శ్రీ రాధాగోవింద - శ్రీ రాధాగోవిందుల; ప్రేమే - ప్రేమలో; సదా - నిరంతరమూ; యేన భాసీ - మునిగి తేలే విధంగా;
అనువాదం
సర్వదా శ్రీ శ్రీ రాధా గోవిందుల ప్రేమలో మునిగి తేలాలని అతి దీనుడైన ఈ కృష్ణ దాసుడు నిన్ను ప్రార్థిస్తున్నాడు.
శ్రీ తులసీ ప్రదక్షిణ మంత్రం
యాని కాని చ పాపాని బ్రహ్మ-హత్యాదికాని చ
తాని తాని ప్రణష్యన్తి ప్రదక్షిణ: పదే పదే
ప్రతి పదార్థం
యాని కాని చ - ఎటువంటి; పాపాని - పాపములైననూ; బ్రహ్మ హత్యాది కాని చ - బ్రాహ్మణ హత్య వంటి పాపములు కూడా; తాని తాని - అవన్నీ; ప్రణష్యన్తి - నశించిపోవును; ప్రదక్షిణ - (తులసీ దేవికి) ప్రదక్షిణ చేయడం ద్వారా; పదే పదే - ప్రతి పదములోనూ
అనువాదం
శ్రీమతి తులసీ దేవికి ప్రదక్షిణ చేయడం ద్వారా మన పాపములన్నింటితో పాటు బ్రాహ్మణుని చంపిన పాపము కూడా నశించును.